10 Tips to Choose Online IAS Coaching in Hyderabad-ClickHere
IAS,IPS లను కలిసి మీ సందేహాలు అడిగి తెలుసుకునే గొప్ప అవకాశం-Click Here
ఘజియాబాద్: ఇప్పుడున్నది కరోనా కాలం.. డ్యూటీలకు పోవాలంటేనే జనాలు జంకుతున్న పరిస్థితి. మరి ఇలాంటి టైంలో ఆరు నెలలు సెలవు దొరికితే ఎవరైనా వదులుకుంటరా? డెలివరీ అయిన రెండు వారాల్లోనే ఆఫీసుకు వెళ్తారా? కానీ సెలవులను ఈమె వదులుకున్నరు. చంటిబిడ్డతో వెళ్లి డ్యూటీలో జాయిన్ అయ్యారు. అలాగని తాను చేస్తున్నది ఏదో సాదాసీదా జాబ్ కాదు. ఆమె ఒక ఐఏఎస్. ఒక జిల్లాకు కరోనా నోడల్ ఆఫీసర్. కష్టకాలంలో రెస్ట్ తీసుకోవడం కంటే.. డ్యూటీ చేసి 10 మందికి సాయపడాలని భావించారు. వైరస్ భయాన్ని వదిలి ఆఫీసుకు వెళ్లారు. సిజేరియన్ ఆపరేషన్ నుంచి కోలుకోగానే మెటర్నిటీ లీవ్ తీసుకోకుండా, ఒడిలో చిట్టితల్లితో డ్యూటీలో చేరారు. నిజానికి నార్మల్ డెలివరీ జరిగి ఉంటే ఇంకా ముందే ఆఫీసుకు వచ్చే వారేమో. యూపీలోని ఘజియాబాద్‌లో మోదీనగర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్(ఎస్డీఎం) సౌమ్యా పాండే గురించే ఇదంతా. ఆఫీసుకు వచ్చిన ఆమెను పలకరించగా.. ‘‘కరోనా టైం కదా అందరూ తమ బాధ్యతలు నెరవేర్చాలి. అందుకే వచ్చేశా” అని నవ్వుతూ చెప్పేశారు. ‘‘పిల్లల్ని కనడం, వారి బాగోగుల్ని చూసుకోవడం.. దేవుడు ఆడవాళ్లకు ఇచ్చిన శక్తి. మన దేశంలో ఊళ్లల్లో ఆడవాళ్లు డెలివరీకి కొన్ని రోజుల ముందు కూడా తమ పనులు తాము చేసుకుంటారు. డెలివరీ తర్వాత కొన్ని రోజుల్లోనే ఇంట్లో పనులన్నీ చేసుకుంటారు. చిన్నారులను చూసుకుంటారు. అట్లనే నేను కూడా’’ అని సింపుల్ గా చెప్పేశారు. ‘‘జులై నుంచి ఘజియాబాద్ కరోనా నోడల్ ఆఫీసర్ గా పని చేస్తున్నా. ఆపరేషన్ కోసం సెప్టెంబర్ లో 22 రోజులు సెలవు తీసుకున్నా. డెలివరీ అయిన రెండు వారాల తర్వాత డ్యూటీలో జాయిన్ అయ్యా” అని వివరించారు. తన ఫ్యామిలీ, ఘజియాబాద్ జిల్లా మెజిస్ట్రేట్, అధికారులు ఎంతో సహకరించినట్లు చెప్పారు.