కొరియాలోని ఓ హోట‌ల్ లో ఇద్ద‌రు ల‌వ‌ర్స్ డిన్న‌ర్ చేస్తున్నారు. వారు ఇండియా నుండి ఉద్యోగం నిమిత్తం అక్క‌డికి వెళ్లిన‌వారు…. ఏడాదికి కోట్ల‌లో జీతం.! ఏవేవో మాటలు , ప్యూచ‌ర్ ప్లాన్స్ న‌డుస్తున్నాయి ఆ ఇద్దరి మ‌ధ్య‌..

  • అబ్బాయి:  నిన్ను ఎప్పుడూ సంతోషంగా ఉంచాలంటే ఏం చేయాలి?
  • అమ్మాయి: నాకు కాబోయే వాడిని IAS గా చూడాల‌ని ఉంది
  • అబ్బాయి: ఓస్ ఇంతేనా….ఈ రోజు నుండి నీ కోరిక‌ను తీర్చ‌డ‌మే నా ల‌క్ష్యం!

క‌ట్ చేస్తే…… 2018 లో UPPSC లో మొద‌టి ర్యాంక్ సాధించిన క‌నిష్క్ క‌టారియా అంటూ వార్త‌.! అత‌నే ఆ రోజు రెస్టారెంట్లో ల‌వ‌ర్ కు మాటిచ్చిన వ్య‌క్తి…ఆ అమ్మాయి పేరు సోనల్… రిజ‌ల్ట్స్ వ‌చ్చిన ఏడాది లోపు ఇద్ద‌రూ పెళ్లి చేసుకొని ఒక‌ట‌య్యారు.!

ల‌క్ష్యం అంత ఈజీగా సాధ్య‌మైందా?
సివిల్స్ అంటే ఆషామాషీ విష‌యం కాదు. ఆ విష‌యం క‌టారియాకు కూడా తెలుసు ఎందుకంటే అత‌ని తండ్రి కూడా ఓ IAS ఆఫీస‌రే! సౌత్ కొరియాలోని సామ్ సంగ్ లో కోట్ల రూపాయ‌ల ప్యాకేజ్ ను ఎర్న్ చేస్తున్న క‌టారియా ల‌వ‌ర్ కు ఇచ్చిన మాట కోసం ఇండియా వ‌చ్చి ఓ సివిల్స్ కోచింగ్ సెంట‌ర్లో జాయిన్ అయ్యాడు. 7-8 నెల‌ల క‌ష్ట‌ప‌డి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాక‌….రోజుకు 12-13 గంట‌లు క‌ష్ట‌ప‌డి చ‌దివాడు…త‌నకిష్ట‌మైన మ్యాథ్స్ ను ఆఫ్ష‌న‌ల్ స‌బ్జెక్ట్ గా ఎన్నుకొని ప‌రీక్ష‌లు రాసి 2018 సివిల్స్ లో ఫ‌స్ట్ ర్యాంక్ సాధించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here